భారతదేశం, నవంబర్ 14 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 14 ఎపిసోడ్ లో బోర్డు మీటింగ్ లో అందరూ నన్ను జోకర్ ను చేశారు. మా తాత, డాడీ, మమ్మీ కలిసి పనిమనిషికి ఉన్న అర్హత కూడా నాకు లేదన్నారని పారిజాతంతో చెప్తూ మండిపడుతుంది జ్యోత్స్న. దీప సీఈఓగా ఉంటే పొడుద్దామనుకున్నా. కానీ అది కూడా ట్విస్ట్ ఇచ్చిందని పారు అంటుంది. ఇవన్నీ జరగడానికి కారణం బావ. ఇప్పుడు అది ఏమై ఉంటుంది గ్రానీ అని అడుగుతుంది జ్యోత్స్న.

నీ చేతకానితనం. కంపెనీని చేతుల్లో పెడితే నాశనం చేశావు. మీ తాత, నాన్న లాంటి తెలివైన వాళ్లు ఉన్నా కూడా కంపెనీని నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడలేకపోయారు. తప్పు చేశాననే బాధ లేదు కదా అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. తప్పుల నుంచి కొన్ని నేర్చుకున్నా. సరిదిద్దుకునేలోపే సెండాఫ్ ఇచ్చారు. దీపను, బావను ప్రశాంతంగా ఉండనిస్తాననుకున్నావా? ఈ జ్యోత్స్న ఎంత డేంజరో తొందర్లోనే ...