Hyderabad, సెప్టెంబర్ 13 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్నకు దీప తన తాళి ఇవ్వడంపై కార్తీక్ పంచ్‌లు వేస్తాడు. ఈ మధ్య కాలంలో కనిపించని దీప దర్శనం ఇచ్చింది. తొందర్లోనే అందరికి అరిటాకు వేసి విందు భోజనం పెడతా. నేను అన్ని ఓడిన బాధలో ఉన్నాను. నువ్వు అని గెలిచిన ఆనందంలో ఉన్నావ్ అని జ్యోత్స్న అంటుంది.

నేను ఏం సంతోషంగా లేను. మనసులో మోయలేని బాధ ఎంతో ఉంది అని కార్తీక్ అంటే.. అది తీర్చుకునేందుగా శౌర్యను తీసుకొచ్చింది. చిన్న పిల్లను అడ్డు పెట్టుకుని భలే డ్రామాలు ఆడతావ్ బావ అని జ్యోత్స్న అంటుంది. ఏమేం డ్రామాలు ఆడాను. నాకు వచ్చేది ఏంటని కార్తీక్ అడుగుతాడు.

నేను తాళి తీసినప్పటి నుంచి, కంపెనీ నష్టాల్లోకి వచ్చాకా మా తాత యాంటీగా తయారయ్యాడు. నాగున్న సపోర్ట్ మా అమ్మ. ఇప్పుడు శౌర్యతో మా అమ్మను నీ వైపు లాక్కుని కంపెనీ సీఈఓ కావాలని చూస్తున్న...