భారతదేశం, జూలై 8 -- కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో బావ, దీప కలిసే తననకు ఇరికించారని జ్యోత్స్న అనుకుంటుంది. గౌతమ్ వాళ్ల ఇంటికి వెళ్లి సారీ చెప్పమని దశరథ్ అంటాడు. ఒంటరిగా వెళ్లొద్దని, ఎవరినైనా తోడు తీసుకెళ్లమని దీప అంటే.. నేను వెళ్తానని కార్తీక్ వెళ్తాడు. ఈ పెళ్లి జరిగే వరకూ జ్యోత్స్నకు దూరంగా ఉండూ అని మరోసారి పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ.

మరో వైపు రీటాతో క్లోజ్ గా ఉంటాడు గౌతమ్. అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. వాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు కాశీ వీడియో తీస్తాడు. ఈ వీడియోతో పెళ్లి ఆగిపోతుందని అనుకుంటాడు కాశీ. నేను రీటానే పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్తానని గౌతమ్ అంటాడు. గౌతమ్ ఎలాంటి వాడో అందరికీ తెలిసేలా చేస్తానని కాశీ అనుకుంటాడు.

మధ్యలోని కారు ఆపమని చెప్పిన జ్యోత్స్న కార్తీక్ ను దిగమంటుంది. నా గురించి నీకేమై...