భారతదేశం, డిసెంబర్ 23 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 23 ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కాశీ.. వైరాకు కాల్ చేసి కార్తీక్ మా బావ, శ్రీధర్ మా మామయ్య అని చెప్తాడు. షాక్ అయిన వైరా మంచి పనే చేశావ్. నీ లాంటి టాలెంటెడ్ పర్సన్ ను పీఏగా పెట్టుకుని మీ మామయ్య తప్పు చేశాడని కాశీని మాయ చేయాలనే చూస్తాడు.

ఏదో చిన్న వార్నింగ్ లాంటిది అంటే సరే అన్నాను కానీ ఇప్పుడు భయంగా ఉందని కాశీ అంటాడు. కల్తీ ఫుడ్ తిన్నవాళ్లు ఎవరైనా చచ్చారా? నీ పేరు ఎవరైనా చెప్పారా? మరి ఎందుకు భయపడుతున్నావ్. మీ మామను సరైన దెబ్బ కొట్టావు. దీంతో సీఈఓ పోస్ట్ పోతుంది. బెయిల్ అంటావేంటీ? ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. అనవసరంగా కంగారు పడి నా పేరు చెప్పకు. నష్టం నీకే. నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తారని వైరా భయపెడతాడు.

వైరాతో కాశీ ఫోన్లో మాట్లాడుతుండగా కార్తీక్ వచ్చి భుజం మీద చేయి వ...