భారతదేశం, జనవరి 20 -- కార్తీక దీపం 2 టుడే జనవరి 20 ఎపిసోడ్ లో రేపో ఎల్లుండో రిపోర్ట్స్ వస్తాయి. సుమిత్ర శాంపిల్ తో జ్యోత్స్న శాంపిల్ మ్యాచ్ కావడం లేదని డాక్టర్ చెప్తుంది. అప్పుడు అందరిలో డౌట్ మొదలవుతుంది. అప్పుడు డాక్టర్ జ్యోత్స్న మీ కూతురు కాదని చెప్తుంది. మనకు గట్టిగానే మూడిందని జ్యోతో పారిజాతం అంటుంటే తథాస్తు అంటూ కార్తీక్ వస్తాడు.

మనకు గట్టిగానే మూడిందన్నారు కదా అందుకే తథాస్తు అన్నా. చేసిన తప్పులు బయటపడతాయని అన్నారు. ఒక నిజం తెలుసుకోవడానికి వచ్చా. బయటకు తెలియకూడదని మీలో మీరే టెన్షన్ పడుతున్నారో అదే నిజమని కార్తీక్ అడుగుతాడు. దీనికి హాస్పిటల్ అంటే భయం కదా సూది గుచ్చి మరీ బ్లడ్ తీశారు. మరి సర్జరీ అప్పుడు ఎలా అని భయపడుతుందని పారు అంటుంది. బోన్ మ్యారో ఇవ్వాల్సింది పెద్ద మేడం గారు కాదు కన్న కూతురు అని కార్తీక్ షాక్ ఇస్తాడు.

ఎవరైనా కన్నతల...