భారతదేశం, నవంబర్ 25 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 25 ఎపిసోడ్ లో దీప ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. నీకు తమ్ముడో, చెల్లో పుడతారే అని శౌర్యకు అర్థమయ్యేలా చెప్తుంది సుమిత్ర. మా అమ్మ నా మనవరాలి రూపంలో నా ఇంట్లోనే పుట్టబోతుంది నాన్న అని ఆనందంతో కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇంట్లో హోమం జరిగింది. మంచి జరిగిందని శ్రీధర్ అంటాడు. గురువు గారు ఓ శుభవార్త విన్నా. నాకున్న భయాలన్నీ పోయాయని శివన్నారాయణ సంతోషపడతాడు. కానీ ముప్పు తొలగిపోలేదని గురువు అనుకుంటాడు. దీప ప్రెగ్నెంట్ అయిందని డాక్టర్ చెప్పిందా? లేదా నేనే ఊహించుకుంటున్నానా? అని షాక్ లో పారును అడుగుతుంది జ్యోత్స్న. వాళ్ల ఇద్దరి మధ్య ఇలాంటివి ఏవీ లేవు కాబట్టే నా ఆశలను చంపుకోలేదు. కానీ ఇప్పుడు బావ వల్ల దీప ప...