భారతదేశం, ఆగస్టు 22 -- కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 22వ తేదీ ఎపిసోడ్ లో పెళ్లికి ముందు మగపెళ్లివాళ్లకు బట్టలు పెట్టాలని శివన్నారాయణ అంటాడు. మిగతా వాళ్లకు మీరు పెట్టండి. ఇంటి ఆడపడుచుకు మాత్రం నేనే బట్టలు పెడతా అని శివన్నారాయణ అనగానే కాంచన సంబరపడుతుంది. కానీ ఎవరి శుభ కార్యమైనా మీ అమ్మ చీర కొనిచ్చేది. ఇది మీ అమ్మ పేరు మీద కొన్నా దశరథ అని శివన్నారాయణ అనగానే కాంచన ఆనందం ఆవిరైపోతుంది. నేనేం అనుకుని తీసుకోవాలో అని ఆలోచిస్తున్నా అని కాంచన అంటుంది.

నన్ను పెళ్లి కొడుకు తల్లి అనుకుని చీర ఇస్తే నువ్వు పాటించే పద్ధతి అవుతుంది. ఒక డ్రైవర్ తల్లికి చీర కొనిచ్చానని అనుకుంటే అది జాలి అవుతుంది. అసలు ఎవరో తెలియన మనిషికి చీర కొనిచ్చాను అనుకుంటే అది నాకిచ్చే దానం అవుతుంది. నా ఆడబిడ్డకు చీర కొనిచ్చానని అనుకుంటే ఇది నా తల్లి ఆశీర్వాదం అవుతుంది. నా తల్లి ఆఖరి ఊపిర...