భారతదేశం, జూన్ 25 -- కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో తన వజ్రాల దుద్దుల్లో ఒక బుట్ట దొంగతనం జరిగిందని, దీప తీసిందని పారిజాతం ఆరోపిస్తుంది. కిచెన్ లోకి సుమిత్ర, పారు వెళ్లి వెతుకుతారు. ఓ ర్యాకులో నుంచి ఆ చెవి దుద్దును పారు బయటకు తీసి సుమిత్రకు చూపిస్తుంది. రేయ్ కార్తీక్ చూడు.. నా వజ్రాల బుట్టను మీ ఆవిడే దొంగతనం చేసిందని పారు అంటుంది. మూడోసారి నింద నిజం కావొచ్చు కదా అని పారు అంటుంది. దీప దొరికిపోయిందిగా అని జ్యోత్స్న అంటుంది.

ఆ వజ్రాల దుద్దు నా పర్సులో దొరకడం ఏంటీ అని దీప కంగారు పడుతుంది. ఈ వజ్రాల బుట్ట నీ పర్సులోనే ఉంది? కావాలని పెట్టినట్లుంది అని సుమిత్ర అంటుంది. నువ్వు దొంగతనం చేశావని అన్నారు, నేను నమ్ముతున్నా అని సుమిత్ర అనగానే దీప షాక్ అవుతుంది. దీప తీయలేదని అంటుంది కదా అని దశరథ్ అంటే.. అందరూ దీపనే దొంగగా చూస్తారు. దొంగకు ఈ ఇంట్లో చోట...