భారతదేశం, జూలై 22 -- కార్తీక దీపం 2 టుడే జులై 22వ తేదీ ఎపిసోడ్ లో జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఆగిపోవాలని దీప దగ్గర మొసలి కన్నీరు కారుస్తుంది పారిజాతం. ఈ నిశ్చితార్థం జరిగి జ్యోత్స్న జీవితానికి ఏదైనా అన్యాయం జరిగితే సుమిత్ర బతుకుతుందా? దశరథ బతుకుతాడా? పరువు కోసం బతికే ఆ పెద్దాయన బతుకుతాడా? అంతా బాగుంటే నాకూ సంతోషమే. ఏదైనా తేడా జరిగితే ఇంటిల్లిపాది ఉరేసుకుని చావాలి. ఎవరు ఎలా పోతే నాకెందుకు అనుకోవచ్చు? కానీ జ్యోత్స్న స్వయానా నీ అత్త కాంచన మేనకోడలు. అన్న కూతురుకు ప్రమాదం వస్తే ఆవిడ ప్రశాంతంగా ఉండగలదా? ఆమెకు ఏమైనా అయితే? నిశ్చితార్థాన్ని ఆపాలి దీప అని చేతులు పట్టుకుని బతిమిలాడుతుంది పారు.

ఎలాగైనా నిశ్చితార్థం ఆపమని దీపను రిక్వెస్ట్ చేస్తుంది పారిజాతం.పెద్దగా టైమ్ లేదు దీప. ఏదైనా నీ వల్ల అవుతుంది. నీ ముందు ఏదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేవు. అన్...