భారతదేశం, జూన్ 17 -- కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో శివన్నారాయణ ఇంట్లో కార్తీక్, దీప వంట గదిలో ఉంటారు. ఏం మరదలా ఈ రోజు వంట ఏంటీ? అని దీపను అడుగుతాడు కార్తీక్. ముందు మా అమ్మ సంగతి చెప్పండి అని దీప అంటుంది. చెప్పాల్సిన పద్దతిలో చెప్పావు కదా, మళ్లీ నిన్ను ఇంట్లో నుంచి ఎవ్వరూ పొమ్మనరు కానీ కార్తీక్ అంటే.. మా అమ్మ బాధ పడుతుంది కదా అని దీప ఫీల్ అవుతుంది. ఈ బాధ తాత్కాలికమే అంటూ మన గోల్ ఏంటి అని చెప్తుండగా పారిజాతం ఎంట్రీ ఇస్తోంది.

మనం మనం ఒకటే కదా పారు అని కార్తీక్ మళ్లీ కామెడీ చేస్తాడు. మరదలు కోసం మంచి ఫిల్టర్ కాపీ కలపరా అని పారు అంటే.. మరదలు ఇక్కడే ఉంది కదా అని దీపను చూపిస్తాడు. మరదలు అంటే జ్యోత్స్న అని పారు చెప్తుంది. సారీ ఇంట్లో ఎవరితోనూ వరసలు కలపను అని కార్తీక్ అంటాడు. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జ్యో చిటికె వేస్తూ గ్రానీ వచ్చిన పని చూసుకోకుండా...