భారతదేశం, సెప్టెంబర్ 8 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో డైనింగ్ టేబుల్ మీద వంటకాల వాసన చూస్తూ ఆహా అనుకుంటుంది పారిజాతం. దశరథ వచ్చి సుమిత్ర పక్కన కాకుండా ఎదురుగా వెళ్లి కూర్చుంటాడు. అందరికీ వడ్డించిన దీప పారును మాత్రం వదిలేస్తుంది. మీకు ఇష్టమైన వంటలు స్వయంగా బావే చేస్తున్నాడని దీప చెప్తుంది. కార్తీక్ నా కోసం ప్రాన్స్ బిర్యానీ చేశాడన్నమాట అని పారు అంటుంది.

బౌల్ లోని ఉడికించిన కూరగాయలు చూసి పారు కంగు తింటుంది. ఇవి కాకుండా వేరే ఏవి తిన్నా పోతావని పారుతో కార్తీక్ అంటాడు. ఇవేమీ వద్దు జ్యూస్ కావాలని పారు అడుగుతుంది. కాకరకాయ జ్యూస్ ను పారుకు ఇస్తాడు కార్తీక్. గ్రానీ రేపటి నుంచైనా తినాల్సిందే, తాగాల్సిందే. ఇప్పటి నుంచే మొదలెట్టమని జ్యో చెప్తుంది. పారు అయిష్టంగానే తింటుంది.

మేం తర్వాత తింటామని శివన్నారాయణ తో దీప అంటుంది. వాళ్లు చిలకా గోర...