Hyderabad, అక్టోబర్ 2 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్నకి శ్రీధర్ పది కోట్ల చెక్ ఇవ్వడం గురించి కార్తీక్‌కు దశరథ్ చెబుతాడు. నీదే ఫైనల్ డెసిషిన్ నీదే అన్నానని జ్యోత్స్న అంటుంది. నీది కూడా ఇదే నిర్ణయం అని చెప్పు. నువ్ రాసుకున్న అగ్రిమెంట్‌కి ఇది జడ్జి‌మెంట్ డే అని చెప్పిన శ్రీధర్ ఆ చెక్ తీసుకుని జ్యోత్స్నకి ఇచ్చి నా కొడుకు ఒప్పుకున్నాడు అని చెబుతాడు.

నా కొడుకును నేను తీసుకెళ్లిపోతున్నాను. రేయ్ ఇకనుంచి నువ్వు ఫ్రీ బర్డ్‌వి. నువ్వు ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిన పని చేసుకోవచ్చు. పదా వెళ్లిపోదాం అని శ్రీధర్ అంటాడు. జ్యోత్స్న నుంచి ఆ చెక్ తీసుకుని శ్రీధర్‌కే ఇచ్చేస్తాడు కార్తీక్. నువ్వెళ్లు మాస్టర్. నేను అగ్రిమెంట్ రద్దు చేయడానికి సిద్ధంగా లేను. నాకు ఎవరి సాయం అవసరం లేదు అని కార్తీక్ అంటాడు.

నేను నీ తండ్రి...