భారతదేశం, డిసెంబర్ 4 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ్, జ్యోత్స్న కారులో దీప ఇంటికి వెళ్తుంటారు. జ్యోత్స్న కోపంగా ఉంటుంది. దీప అంటే నచ్చదంటుంది. కారు ఆపమంటాడు దశరథ్. వెళ్లి రెండు ఐస్‌క్రీమ్స్ తీసుకొచ్చి జ్యోత్స్నకు ఇస్తాడు దశరథ్. ఇద్దరు ఐస్‌క్రీమ్ తింటారు. మనం కాసేపు తండ్రికూతుళ్లలా మాట్లాడుకుందామా అని దశరథ్ అంటే మనం తండ్రి కూతుళ్లమే అని జ్యో అంటుంది.

నువ్వు నా కూతురువి కాదు. నా కూతురు వేరే ఉంది. ఇప్పుడు లేదు అని పెద్ద షాక్ ఇస్తాడు దశరథ్. నా కూతురు అది ఇది కొనివ్వమని అడిగేది.. నాతో సరదాగా మాట్లాడేది అని జ్యో చిన్నప్పటి విషయాలు చెబుతాడు దశరథ్. నా కూతురు ఒకేసారి పెద్దదైపోయింది. వయసులో కాదు ప్రవర్తనలో. కోపం పెంచుకుంది, ఎవరు విషం నింపారో తెలియదు. ఒక్కోసారి ఇది నా కూతురునే అనిపిస్తుందని దశరథ్ అంటాడు.

మీ ఆశలు నేను నిలబెడతాను అ...