భారతదేశం, డిసెంబర్ 30 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 30 ఎపిసోడ్ లో వచ్చే జన్మలోనైనా నువ్వు కూతురుగా పుడతావేమో అని దీపతో చెప్తూ దశరథ బాధపడ్డాడు. నేను మీ కూతురునని చెప్పి మీ బాధంతా పోగొట్టాలని ఉంది, కానీ చెప్పలేనని దీప అనుకుంటుంది. మీరేం బాధపడకండి. సుమిత్రమ్మ గారికి ఏం కాదని దీప చెప్తుండగా సుమిత్ర వస్తుంది.

సుమిత్రమ్మకు ఏం కాదని చెప్పావేంటీ? ఇప్పుడు నాకు ఏమైందని అడుగుతుంది సుమిత్ర. ఏం లేదు సుమిత్ర. రిపోర్ట్స్ వస్తాయి కదా అదే దీప చెప్తుందని దశరథ కవర్ చేస్తాడు. డాక్టర్ ఫోన్ చేసి సుమిత్రను హాస్పిటల్లో అడ్మిట్ కావాలని చెప్పారా? నాకు ఏం లేదని డాక్టర్ చెప్పాలా? నాకు తెలియదా? మీ ఆయన ఎక్కడ? అని అడుగుతుంది సుమిత్ర. చిన్న పని మీద బయటకు వెళ్లాడమ్మా అని దీప చెప్తుంది.

జ్యోత్స్న మాటల గురించి వైరా ఆలోచిస్తుంటాడు. అప్పుడే కాశీ ఎంట్రీ ఇస్తాడు. జాయి...