భారతదేశం, జూన్ 16 -- కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో కార్తీక్ ను బావా అని పిలవడంతో శౌర్య, కాంచన, అనసూయ షాక్ అవుతారు. అమ్మా నువ్వు ఇప్పుడు ఏమని పిలిచాడు అని శౌర్య ప్రశ్నిస్తుంది. బావా అని కొత్త పిలుపు ఏంటీ దీప? అని కాంచన అడుగుతుంది. సొంత మేనత్త కూతురైతే బావా అని పిలవొచ్చు కానీ ఈ కొత్త పిలుపు ఏంటి దీప అని ప్రశ్నిస్తారు. అమ్మకు మీకు సంబంధం ఏంటీ అయినా అక్క అని పిలుస్తున్నారు కదా? అనసూయతో అంటాడు కార్తీక్. కొన్ని పిలుపులను కొన్ని బంధాలకే పరిమితం చేశారు. భార్య భర్తను బావా అని పిలవాలంటే సొంత మేనత్త కూతురే అయి ఉండాలా? అని తిరిగి ప్రశ్నిస్తాడు కార్తీక్.

భర్తలే చనువు ఇవ్వరు? ఇస్తే తీసుకోవడానికి భార్యలు రెడీగా ఉంటారు. నేను నా భార్యకు చనువు ఇచ్చా. అందుకే ఎలా పిలిచినా పలుకుతా అని కార్తీక్ చెప్తాడు. అలాగే పిలవమని నేనే చెప్పాను. కార్తీక్ బాబు ప...