భారతదేశం, డిసెంబర్ 10 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో శ్రీధర్ కు పారిజాతం కాఫీ ఇస్తుంది. మీరు కాఫీ తీసుకురావడం ఏంటీ అత్తయ్య అని అడుగుతాడు శ్రీధర్. ఒక్క రోజు సీఎంలాగా ఒక్క రోజు పని మనిషి పోస్ట్. దీప పోస్ట్ పారుకు అని కార్తీక్ చెప్తాడు. ప్రజెంటేషన్ కోసం అందరినీ పిలుస్తాడు శివ నారాయణ. కాశీకి ఫోన్ చేసి ల్యాప్ టాప్ తీసుకు రమ్మని చెప్తాడు శ్రీధర్.

కాశీ ల్యాప్ టాప్ తీసుకుని వస్తాడు. సర్ ఈ ల్యాప్ టాప్ అక్కడ పెట్టమంటారా? అని కాశీ అడగ్గానే.. సర్ ఏంట్రా మామయ్య కాదా అని పారిజాతం అడుగుతుంది. ఇప్పుడు నేను మామయ్య కాదు కాశీ అల్లుడు కాదు. కాశీ నాకు ఇప్పుడు పీఏ అని శ్రీధర్ షాక్ ఇస్తాడు. ఎప్పుడు అపాయింట్ చేశారు? ఎవరిని అడిగారు? అని జ్యోత్స్న అడుగుతుంది. కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓ ఎవరైనా పీఏను అపాయింట్ చేసుకోవచ్చని కార్తీక్ చెప్తాడు. కాన...