భారతదేశం, నవంబర్ 15 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కాంచను ఉదయం గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతాడు శ్రీధర్. దాంతో కోపంగా కాల్ చేసి మీ భార్యకు చెప్పొచ్చుగా అని అంటుంది. ఇంతలో కార్తీక్ వస్తే రాంగ్ నెంబర్ అని చెబుతుంది కాంచన. కార్తీక్‌కు మల్లెపూలు ఇచ్చి వెళ్లిపోతుంది. ఫోన్ ఆన్‌లోనే ఉంటుంది. శ్రీధర్ మాటలు వింటుంటాడు.

దీపకు మల్లెపూలు పెడతాడు కార్తీక్. ఇంతలో ఇడ్లీ వడ దోశ అని ఒకతను అమ్ముతూ వస్తాడు. అది విని పాత రోజులు గుర్తు చేసుకుంటుంది. బావ నాకు ఒక ఐడియా ఇచ్చింది. ఇడ్లీ బండ్లు అమ్మినట్లుగా జ్యోత్స్న రెస్టారెంట్‌ పేరుతో ఫుడ్ ట్రక్‌లు పెట్టి అపార్ట్‌మెంట్ల దగ్గర, భారీగా జనం ఉన్న దగ్గర అమ్మితే బాగుంటుంది. పది రూపాయల ఖర్చు తగ్గిస్తే చాలు అపార్ట్‌మెంట్ వాళ్లు ఆర్డర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని దీప చెబుతుంది.

ఐడియా బాగుంది. కానీ, అది త...