భారతదేశం, డిసెంబర్ 1 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 1 ఎపిసోడ్ లో కాంచన ఇంట్లో శ్రీధర్ ఉండగా కావేరి వస్తుంది. నా కోడలు దీప కోసం వచ్చాను. తాటి బెల్లంతో చేసిన సున్నుండలు మాత్రం దీపకే పెట్టు అక్క అని కాంచనతో అంటుంది కావేరి. తాత అస్తమానం వస్తాడని శౌర్య చెప్పడంతో దొరికిపోయానని శ్రీధర్ అనుకుంటాడు. సీఈఓ కదా కార్తీక్ తో మాట్లాడేందుకు వస్తాడని కాంచన కవర్ చేస్తుంది. ఇది కూడా ఆయన ఇల్లే కదా అని కావేరి చెప్తుంది.

దీప గురించి మాట్లాడాలి. ఇన్ని రోజులు దీప అంటే నాకు మాత్రమే పెద్దగా పడదు అనుకునేవాణ్ని. కానీ మీ అమ్మకు కూడా దీప అంటే ఇష్టం లేదని ఈ రోజే తెలిసిందే. ఇంకా నిజం మాట్లాడాలి అనుకంటే దీప ప్రెగ్నెంట్ అవడం కూడా నీకు ఇష్టం లేదు కాంచన అని శ్రీధర్ బాంబ్ పేలుస్తాడు. దీపకు బిడ్డ పుట్టడం కూడా కాంచనకు ఇష్టం లేదని శ్రీధర్ అంటాడు. ఇక చాలు ఆపండి, నా కోడలి కడుపు...