భారతదేశం, ఆగస్టు 7 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 7వ తేదీ ఎపిసోడ్ లో దీప తాళి తెంచడంతో జ్యోత్స్నను లాగిపెట్టి కొడుతుంది సుమిత్ర. మంచి మనసు ఉంటే చాలు అనుకుని మంచి చెబుతుంది నా భార్య. స్థాయి కూడా ఉండాలని ఇంత బాగా చెప్తారని అనుకోలేదు అని దీపను తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్. దీప మెడలో తాళి ఎలా తెంపగలిగావు జ్యోత్స్న అని అందరూ అడుగుతారు. దీప నన్ను పెళ్లి చేసుకోమ్మని సలహాలిస్తుంది. నేను చేసుకోవాల్సిన మనిషిని తను చేసుకున్నానన్న పొగరుతో మాట్లాడుతుంది. అది నేను తట్టుకోలేకపోయాను. తాళి పట్టుకున్నా కానీ తెంపే ఉద్దేశం నాకు లేదు. కావాలని తెంపలేదు అని జ్యోత్స్న కవర్ చేస్తుంది.

మన మెడలో కూడా మంగళసూత్రాలు ఉన్నాయి. పొరపాటున తెంపేశామని ఎవరైనా ఉంటే ఊరుకుంటామా? అత్తయ్య అని పారిజాతంతో సుమిత్ర అంటుంది. దీపకు సారీ చెప్పడానికి పదా అని సుమిత్ర అంటే జ్యోత్స...