భారతదేశం, జూన్ 27 -- కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో వీల్ చెయిర్ లో నుంచి కిందపడిపోయిన కాంచనకు ఇంట్లోనే ట్రీట్ మెంట్ అందిస్తారు. డాక్టర్ వచ్చి చికిత్స ఇస్తుంది. దశరథ్, అనసూయ దగ్గరే ఉంటారు. నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ అనసూయ బాధ పడుతుంది. ఇలా జరుగుతుందని తెెలియదు కదా అని దశరథ్ అంటాడు. ఎందుకైనా మంచిది ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్లి, స్కానింగ్ చేయిద్దాం అని దశరథ్ అంటే.. అవసరం లేదని డాక్టర్ చెబుతుంది.

కార్తీక్, దీప ఎందుకు రాలేదు అన్నయ్య అని దశరథ్ ను అనసూయ అడుగుతుంది. నా కూతురు చేసిన పని ఎలా చెప్పాలి అంటూ మనసులోనే మదనపడుతుంటాడు దశరథ్. జరిగింది కార్తీక్ కు తెలిస్తే జ్యోత్స్నను ఎప్పటికీ కార్తీక్ క్షమించడు అని మనసులో అనుకుంటాడు దశరథ్.

మరోవైపు రెండు గంటల పాటు కార్లో తిప్పుతున్నారంటూ జ్యోత్స్నపై కోప్పడతాడు కార్తీక్. ఇంటిక...