భారతదేశం, డిసెంబర్ 2 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 2 ఎపిసోడ్ లో నువ్వు ఈ జన్మలో మారవంటూ జ్యోత్స్నకు క్లాస్ పీకుతూ ఆమె బట్టలను సూట్ కేసులో సర్దుతుంది పారిజాతం. అర్జెంట్ గా కెనడాలోని ఫ్రెండ్ దగ్గరకి వెళ్లిపోమ్మని పారు అంటుంది. నువ్వు దీపను పడగొట్టాలని కాలు అడ్డం పెట్టావు. అది ఎవరు చూడలేదనుకున్నావు, కానీ కార్తీక్ చూశాడు. కొట్టడమే తక్కువ అని పారు చెప్తుంది. నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు గ్రానీ వదిలేయ్ అని జ్యోత్స్న చెప్తుంది.

దీపకు ఏదైనా జరిగితే అనుమానం వచ్చేది నీ మీదేనని జ్యోత్స్నతో పారు అంటుంది. దీప కడుపులో పెరుగుతున్న బావ వారసత్వాన్ని మాత్రం ఉండనివ్వను అని జ్యో కన్నింగ్ గా చెప్తుంది. అదంతా జరగదు. కొన్ని రోజులు దేశం వదిలి వెళ్లిపోవడం మంచిదని పారు చెప్తుంది. కానీ నేను మారను గ్రానీ. వీళ్లంతా ఇక్కడ హ్యాపీగా ఉంటే నేను ఎక్కడికో పారిపోవాల...