భారతదేశం, నవంబర్ 5 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 5 ఎపిసోడ్ లో నువ్వు చేస్తున్న ప్రతిపనిలో నటిస్తున్నట్లు కనిపించడం లేదు. నిజాయతీగా చేస్తున్నట్లే ఉందని సుమిత్ర అంటుంది. నేనెందుకు నటిస్తానమ్మా అని దీప అంటే, కొన్నిసార్లు అవసరం నటించేలా చేస్తుందని సుమిత్ర అంటుంది. పెళ్లి ఆపుదామని తాళి దాచా. కానీ పైకి నవ్వుతూ నిజాయతీగా నటించానని చెప్తుంది.

నాకు కావాల్సిన వాళ్లు నేను వెళ్లిపోతుంటే చూసి కూడా ఆపలేదు. ఏ సంబంధం లేని నువ్వు మాత్రం నాకోసం వెతికావు. నన్ను నీ ఇంటికి తీసుకెళ్లావు. సేవ చేశావు. నా కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లావు. ఎక్కడా నీలో నాకు నటన కనిపించలేదు. రక్త సంబంధం కోసం చేసినట్లే అనిపించింది. నీ తల్లి కోసం ఎలా చేస్తావో అంత ప్రేమతో చేశావు. నేను చూసిన దీప వేరు, అర్థం చేసుకున్న దీప వేరు, ఇప్పుడు చూస్తున్న దీప వేరు. పైగా నువ్వు మా అమ్మవి అని అన్నావ...