భారతదేశం, డిసెంబర్ 3 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 3 ఎపిసోడ్ లో తొమ్మిది దాటిన పనివాళ్లు ఇంకా రాలేదని శివన్నారాయణతో కోపంగా చెప్తుంది పారిజాతం. కడుపుతో ఉన్న మనిషి, వట్టి మనిషి ఒకటే కాదు. అది ఆలోచించే తెలివి నీకు లేదు. రాక పోవడానికి కారణం ఉంటే అని పారుతో శివన్నారాయణ అంటాడు. కార్తీక్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. అందుకే పనివాళ్లకు చనువు ఇవ్వకూడదంటానని పారు అంటుంది.

కాంచనకు కాల్ చేస్తాడు శివన్నారాయణ. కార్తీక్ కు ఫోన్ ఇవ్వమంటాడు. వాళ్లు ఇంకా లేవలేదు. రాత్రి త్వరగా పడుకోలేదు. దీపకు కడుపులో నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే వద్దని చెప్పిందని కాంచన చెప్తుంది. ఫోన్ పెట్టేసిన శివన్నారాయణ సుమిత్రను తీసుకు రమ్మని పారుకు చెప్తాడు. ముసలోడి టెన్షన్ చూస్తుంటే దీప కడుపు పోయినట్లే ఉంది. అదే నిజమైతే పండగే అని పారు అనుకుంటుంది.

కార్తీక్ లేచి టైమ...