Hyderabad, జూలై 12 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నేను నిన్ను అసహ్యించుకుంటున్నాను, చిరాకు పడుతున్నాను ఎంత చేసిన నీకు నాపై ఏమాత్రం కోపం రావట్లేదా, చిరాకు అనిపించట్లేదా అని సుమిత్ర అడిగితే లేదని దీప అంటుంది. అదే ఎందుకు అని అడుగుతుంది సుమిత్ర. ఎందుకుంటే నువ్వు నా తల్లివి అని దీప అంటుంది.

దాంతో సుమిత్ర షాక్ అయినట్లు చూపిస్తారు. కానీ, దీప అలా చెప్పాలనుకుని ఆగిపోతుంది. మౌనంగా ఉంటే ఏంటీ అర్థం. నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. నాకో సాయం చేస్తావా. కాంచన కోసం ఈ చీర తీసుకున్నాను. ఇది తీసుకెళ్లి ఇవ్వు అని సుమిత్ర అంటుంది. నాకన్న మీరిస్తేనా బాగుంటుందని దీప అంటుంది.

నువ్ నా కూతురుకి రివాల్వర్ గురి పెట్టినప్పుడు మొదలైన భయం ఇప్పటికీ అలాగే ఉంది. నువ్ ఎక్కడ నా కూతురు నిశ్చితార్థం చెడగొడతావేమో అని భయంగా ఉందని సుమిత్ర చెబుతుంది. జ్యోత్స్న పుట్టుక...