Hyderabad, ఆగస్టు 29 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీప, కార్తీక్ పెళ్లి జరగడంతో ఇంటికి పట్టిన అరిష్టం పోయినట్లేగా అని దశరథ్ అంటే.. అవును, దేవుడి దయవల్ల అరిష్టం త్వరగా పోయింది అని శివ నారాయణ అంటాడు. జ్యోత్స్న చెడు పని చేస్తే తిడతారు మంచి పని చేస్తే దేవుడు అంటారు అని పారు అంటుంది.

జ్యోత్స్న చేసిన మంచి పని ఏంటో అని శివ నారాయణ అంటే.. దీప మెడలో తాళి తెంపడం. కార్తీక్ గాడు పెళ్లి ఇక్కడ చేయమనడం. దాంతో అరిష్టం పోవడం. జ్యోత్స్న జీవితానికి మంచి జరగడానికి దేవుడే దీప మెడలో తాళి తెంపించాడు. ఓ అనాథకు వీళ్ల చేతుల మీదుగా పెళ్లి జరిపించే అవకాశం వచ్చిందని పారిజాతం అంటుంది. రేపు సత్యనారాయణ వ్రతం కూడా మనం జరిపిస్తే పూర్తి బాధ్యత నెరవేరినట్లే అని పారు అంటుంది.

శివ నారాయణ మెచ్చుకుని అన్ని మంచి మాటలు వస్తున్నాయి. సరే అంటాడు శివ నారాయణ. జ్యోత్స్న ...