Hyderabad, ఆగస్టు 1 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీప తండ్రి చనిపోయాడని పారు అంటే చనిపోలేదని దీప కోప్పడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. చనిపోయిన వాడి ఫొటో ముందే ఉంటే చనిపోలేదని అంటావేంటీ అని శ్రీధర్ అంటాడు. అది నా తమ్ముడి కుబేర ఫోటో. దీప నా తమ్ముడి కూతురు కాదు అని అనసూయ చెబుతుంది.

దీప ఎవరో అనసూయకు తెలుసా అని జ్యోత్స్న భయపడుతుంది. మరి దీప ఎవరి కూతురు అని శ్రీధర్ అంటే అది నాకు తెలియదు అని అనసూయ చెబుతుంది. కుబేరా నా తమ్ముడే కానీ దీప తండ్రి కాదు. ఎవరో కనేసి పారిపోతే నా తమ్ముడు వచ్చి పెంచుకున్నాడు. నా తమ్ముడికి దీప బస్టాండ్‌లో దొరికింది అని అసలు విషయం చెబుతుంది అనసూయ.

దాంతో పారిజాతం తెగ భయపడిపోతంది. దాసు చెప్పింది గుర్తు చేసికుని వణికిపోతుంది. ఈ నిజం చెప్పే పరిస్థితి ఇంతవరకు రాలేదు. అందుకే చెప్పలేదు అని అనసూయ కాంచనతో అంటుంది. అ...