భారతదేశం, జనవరి 28 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 28 ఎపిసోడ్ లో ఇంతకుముందు దీపను చంపినవాళ్లే మళ్లీ వచ్చి ఉంటారా? జైల్లో ఉన్నవాడు తన మనుషులను పంపిస్తున్నాడా? అని కాంచన కంగారు అడుగుతుంది. ఇది నరసింహ చేసింది కాదమ్మా అని కార్తీక్ చెబుతుండగా శౌర్య వస్తుంది. శౌర్య ముందు ఏం మాట్లాడొద్దని కార్తీక్ అనడంతో అందరూ సైలెంట్ అయిపోతారు.

మన ఇంట్లోకి వచ్చి చంపాలనుకున్నాడంటే అవతలి వాళ్లకు తీరని పగైనా ఉండాలి లేదా నువ్వు అడ్డుగానైనా ఉండాలని కాంచన దీపతో అంటుంది. అలాంటి వాళ్లు ఒక్కరే ఉన్నారు జ్యోత్స్న అని అనుకుంటుంది దీప. మరోవైపు జ్యోత్స్నకు కాల్ చేసి జస్ట్ లో మిస్ అయిందని రౌడీ చెప్తాడు. వాళ్లు నిద్రలేచారు మేడం, తప్పించుకున్నామని చెప్తాడు. డెన్ కు వెళ్లిపోండి మనం తర్వాత మాట్లాడుకుందామని జ్యో చెప్తుంది. వెనక్కి తిరిగి చూస్తే దశరథ ఉంటాడు.

ఎవరు ఫోన్లో? మళ్...