భారతదేశం, డిసెంబర్ 25 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 25 ఎపిసోడ్ లో మనం చేసిన తప్పు మనకు ముందు అర్థం కాదమ్మా. నాన్న ముఖం నేను చూడగలనా? పాపం మనలాగే పెద్దమ్మ కూడా బాధ పడుతూ ఉంటుంది అని తల్లికి ఏడుస్తూ చెప్తుంది స్వప్న. కాంచనకు కాల్ చేసి ఇస్తుంది స్వప్న.

అక్క, జరిగిందంతా నీకు తెలిసే ఉంటుంది కదా. నాకు భయంగా ఉంది అక్క అని కావేరి అంటుంది. స్వప్న వాళ్ల నాన్న తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా? అని కాంచన అడుగుతుంది. దీనికి సమాధానం ఒక్క మాటలో చెప్పలేనక్క. ఆయనకు సీఈఓ పోస్టు వచ్చినప్పటి నుంచి మీ పుట్టింటి వాళ్లు అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి అంటున్నారు. ఆయన తప్పు చేయడని నమ్ముతా. ఆయన ఎదుగుదలను ఓర్చుకోనివాళ్లు ఇది చేసి ఉంటారని కావేరి అంటుంది.

అక్క, నువ్వు పోలీస్ స్టేషన్ కు వెళ్లావా? ఆయనకు నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అక్క. నీ గురించే ఆలోచిస్తా...