భారతదేశం, మే 2 -- దీప జైలు నుంచి రిలీజ్ కావ‌డంతో కాంచ‌న‌, అన‌సూయతో పాటు కార్తీక్ ఆనంద‌ప‌డ‌తాడు. శ్రీధ‌ర్ వారి సంతోషాన్ని చెడ‌గొడ‌తాడు. దీప‌కు వ‌చ్చింది బెయిల్ మాత్ర‌మే అంట‌, ఏ మాత్రం అటు ఇటు అయినా జైలుకు వెళ్ల‌చ్చు అని ప‌బ్లిక్ టాక్ వినిపిస్తుంద‌ని చెబుతాడు. జైలులో ఇలాగే తిక్క‌తిక్క‌గా మాట్లాడార‌ని, కార్తీక్‌కు విడాకులు ఇస్తే వేరే పెళ్లి చేసుకుంటాడ‌ని దీప‌తో ఆ రోజు ఇలాగే అన్నార‌ని కావేరి అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.

దీప‌కు ఈ స‌ల‌హా ఇచ్చిందా నువ్వా అని కార్తీక్ షాక‌వుతాడు. నీ కొడుకు పెళ్లాం ద‌గ్గ‌ర‌కు వెళ్లి నీ మొగుడుకి విడాకులు ఇవ్వు...రెండో పెళ్లి చేస్తాన‌ని అన‌డానికి సిగ్గులేదా అని శ్రీధ‌ర్‌ను దులిపేస్తుంది అన‌సూయ‌. అందులో త‌ప్పేం ఉంద‌ని శ్రీధ‌ర్ అంటాడు. దీప‌కు శిక్ష‌కు ప‌డితే కార్తీక్‌, శౌర్య ప‌రిస్థితి ఏమిటి? అందుకే పెద్ద మ‌నిషిగా మంచ...