భారతదేశం, నవంబర్ 22 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో హోమంలో పూర్ణాహుతిని పడకుండా కింద పడేసేలా జ్యోత్స్న చేస్తే హోమంలోనే పడేటట్లు దీప చేస్తుంది. అంతా షాక్ అవుతారు. దీప చేత్తోనే హోమం పూర్తి అయిందని దాసు, కార్తీక్ సంతోషిస్తారు. దాసు వెళ్లిపోతాడు. దీపను పారిజాతం అనబోతుంటే శివ నారాయణ పూజ కానివ్వని అంటుంది.

పంతులు వెళ్తానంటే.. జ్యోత్స్స ఆపి హోమం ఇంటి వారసురాలు చేతులతో పూర్తి కాలేదు. ఇంటి పని మనిషి దీపతో అయిందని అంటుంది. దీప వేసింది కానీ, కావాలని వేసిందా. నీ చేతులో నుంచి జారిపోతుంటే దీప పట్టుకోబోయింది. దాంతో హోమంలో పడింది అని కార్తీక్ అంటాడు. ఈవిడ అసలు పట్టుకుంటే కదా. ఆలోచనలన్నీ ఎక్కడో అని స్వప్న అంటుంది.

నోర్ మూయవే పిల్లకుంకా అని పారు అంటే.. కాశీ కోప్పడతాడు. నోర్ మూయిరా సన్నాసి అని పారు అంటుంది. మా అల్లుడిని అంటే ఊరుకోమని కావేరి అం...