Hyderabad, సెప్టెంబర్ 20 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్య బర్త్ డే ఫంక్షన్‌లో అందరిని కలిపే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. ఇకనుంచి రెండు కుటుంబాలు కలిసి ఉండలేవా. నా భార్యను క్షమించలేవా అత్త అని సుమిత్రను అడుగుతాడు కార్తీక్. మీ మావయ్య నన్ను క్షమించలేదు అని సుమిత్ర అంటుంది.

నిన్ను క్షమించాల్సింది నేను కాదు నా చెల్లి అని దశరథ్ అంటాడు. బాధపడింది దీప అని కాంచన అంటే.. ఇప్పుడు దీప నన్ను క్షమించాలా అని సుమిత్ర అంటుంది. ఆ మాట నేను అనలేదు అని కాంచన అంటుంది. క్షమిస్తానని కూడా అనలేదని సుమిత్ర అంటే నువ్ నా కోడలిని క్షమిస్తా అనలేదని కాంచన అంటుంది. నాకంటే నీకు నీ కోడలే ఎక్కువ ఇష్టమని తెలుసు వదినా అని సుమిత్ర అంటుంది.

అత్త ప్లీజ్ మాటలతో సమస్యను పెంచొద్దు. ఇకనుంచి అంత ఓ కుటుంబంగా ఉందాం. అందరం కలిసుండే దారి చూడండి. ఇది సుమిత్ర అత్తకే కాదు అ...