భారతదేశం, జూలై 25 -- కార్తీక దీపం 2 టుడే జులై 25వ తేదీ ఎపిసోడ్ లో అమ్మమ్మ గురించి అమ్మానాన్నను అడుగుతుంది శౌర్య. పాత జ్ణాపకాలను తలుచుకుంటూ అమ్మ బాధపడుతుందని కార్తీక్ కవర్ చేస్తాడు. ఏ రోజైనా మీ అమ్మానాన్న గురించి చెప్పాల్సిందేగా, దేవుడు త్వరలోనే కలుపుతాడేమో అని దీపతో కార్తీక్ అంటాడు. గౌతమ్ తో ఎంగేజ్మెంట్ జరగనందుకు సంతోషించాలి. త్వరగా జ్యోత్స్నకు మరో పెళ్లి చేసి పంపించేయాలి. ఆ మనిషిని ఓ మనిషిగా మార్చి దాసు మామయ్యకు అప్పగించాలి. నిన్ను మీ అమ్మనాన్నకు అప్పగించాలి. అందరినీ కలుపుదాం దీప అని కార్తీక్ అంటాడు.

మరోవైపు ఎంగేజ్మెంట్ ఆగినందుకు పారిజాతం సంతోషపడుతుంది. సమయానికి మీ నాన్న దాసు వచ్చి ఆపాడని పారు అంటుంది. ఎంగేజ్మెంట్ ఏం పెళ్లి కాదు. వేలికి రింగ్ తొడిగితే ప్రాణాలేం పోవు. తప్పులను ఒప్పుకొని నేను విలన్ అయ్యి, దీపను హీరో చేయడం నాకు ఇష్టం లేదు....