భారతదేశం, నవంబర్ 7 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్నను సీఈఓ చేయడంపై సుమిత్ర అభిప్రాయాన్ని అడుగుతారు. నా కూతురుని పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నాను అని చెప్పి అందరికి షాక్ ఇస్తుంది సుమిత్ర. అదే నా కల. నా కూతురుకు పెళ్లి చేసి ఒక అందమైన జీవితాన్ని కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతకుమించి నేను ఏం కోరుకోవట్లేదు అని సుమిత్ర అంటుంది.

అత్త ఇచ్చిన ట్విస్ట్‌కు దిమ్మ తిరిగిందని దీపతో అంటాడు కార్తీక్. కాసేపట్లో ఆఫీస్‌కు వెళ్లాలి రెడీగా ఉండు అని శివ నారాయణ చెప్పేసి వెళ్లిపోతాడు. పెద్ద మేడమ్‌కు స్ట్రాంగ్‌గా కాఫీ పెట్టమని దీపకు చెబుతాడు కార్తీక్. బావ సీఈఓ అయిపోతే దీప ముందు ఓడిపోయినట్లే అని జ్యోత్స్న అంటుంది. అయితే దీపను పట్టుకో. ఇదే యుద్ధ నీతి. పురాణాల్లో కూడా ఇదే రాసి ఉంది. మనకి సపోర్ట్ చేయడని తెలిసిన మనిషిని సాయం అడగాలి. అప్పుడు త...