భారతదేశం, నవంబర్ 27 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో గురువు గారు చెప్పిన ప్రమాదం గురించి కార్తీక్‌తో చెబుతాడు శివ నారాయణ. ఎవరి మొహం చూసిన భయంగా ఉంది. అప్పుడు కాంచన గుర్తొచ్చింది. తను చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం నుంచి తను బయటకు రావొద్దురా అని శివ నారాయణ అంటాడు.

ముందు ఆ భయంలో నుంచి రా. నువ్వే చెబుతావుగా దైవ సంకల్పం గొప్పదని. మన ఇంట్లో వాళ్లకు, నాకు పుట్టబోయే బిడ్డ వరకు ఎవరికి ఏం కానివ్వను. ఒకవేళ నీ కలలలోకి ప్రమాదం వస్తే ఇంటి గుమ్మం ముందు పోతురాజులా నా మనవడు ఉన్నాడు. నువ్వు వాన్ని దాటి రావాలని చెప్పు, నేను ఆ ప్రమాదం చూసుకుంటాం అని కార్తీక్ అంటాడు.

కత్తికంటే పదునుగా ఉన్నాయిరా నీ మాటలు. చిన్నప్పుడు చీకటిని చూసి భయపడొద్దని నీకు చెప్పాను. చావును చూసి భయపడొద్దని నాకు చెబుతున్నావు. నా పౌరుషం నీలోనూ కూడా ఉందిరా. ఇంక నాకు ఏ భయం లేదురా ఆన...