భారతదేశం, డిసెంబర్ 6 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ ఇంటికి వెళ్తాననడంతో దీప, కార్తీక్‌పై తెగ ఫైర్ అవుతుంది కాంచన. మీకు నచ్చింది చేసుకోండి. నాకు మీ మీద కోపం లేదు. ఇదంతా నా బాధరా అని వెళ్లిపోతుంది కాంచన. ఒకసారి ఆలోచించమని దీపకు చెబుతుంది అనసూయ. మరోవైపు జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని దశరథ చెప్పడంతో శివ నారాయణ తెగ సంతోషిస్తాడు.

అందరికి స్వీట్స్ ఇవ్వమంటాడు. కానీ, జ్యోత్స్న వద్దంటుంది. ఈ తీపి వెనుక ఓ చేదు నిజం ఉంది. ఇప్పటికీ రెండు సార్లు పెళ్లికి ఒప్పుకున్నా. అయినా మనవాళ్లు సంతోషంగా ఉన్నారంటే పెళ్లి పేరుతో పద్ధతిగా గెంటేస్తారని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు నీ బాధ ఏంటని దశరథ్ అడుగుతాడు. దీపకు ట్రీట్‌మెంట్ ఇప్పించడం, బాగా చూసుకోవడం నచ్చట్లేదని జ్యోత్స్న గొడవ చేస్తుంది.

మాకంటే నీకు దీపే ఎక్కువ. కానీ, మీ మాటకు దీప విలువ ఇచ్చ...