Hyderabad, ఆగస్టు 9 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు అమ్మ నాన్నల స్థానంలో సుమిత్ర, దశరథ్ గారు ఉండి పెళ్లి చేయాలని కార్తీక్ అనడంతో ఇంటిల్లిపాది అవాక్కవుతారు. నువ్ ఈ కోరిక కోరావంటే నీకు దీప అమ్మనాన్న తెలుసా. నేను ఎలా రియాక్ట్ అవ్వాలని జ్యోత్స్న అంటుంది. ఇంతపెద్ద షాక్ ఇచ్చావేంటీ బావ అని దీప అంటుంది.

పారుకు మాటలు రావు. తీర్చేవాళ్లు తీరుస్తారు అని కార్తీక్ అంటే.. ఏంట్రా తీర్చేది. దీప పక్కన నిలబడేందుకే ఇబ్బంది పడే నేను. తల్లిగా ఎలా ఒప్పుకుంటాను. అది ఎప్పటికీ జరగదు అని కోపంగా వెళ్లిపోతుంది సుమిత్ర. మీరేమంటారు పెద్దసారు అని శివ నారాయణను కార్తీక్ అడిగితే.. ఇప్పుడేగా చెప్పావ్. ఆలోచించుకోడానికి టైమ్ కావాలి అని శివ నారాయణ వెళ్లిపోతాడు.

వాళ్లకు టైమ్ కావాలట నువ్వెళ్లి వంట చేసుకో అని దీపను పంపిస్తాడు కార్తీక్. పారిజాతంకు మాటలు రావు, గ...