భారతదేశం, జూలై 23 -- కార్తీక దీపం 2 టుడే జులై 23వ తేదీ ఎపిసోడ్ లో నిజం చెప్పాలని దీపతో ఒట్టు వేయించుకుంటుంది సుమిత్ర. నా కూతురు నిశ్చితార్థం జరుగుతుందా? లేదా? అబద్ధం చెప్పావో ప్రాణం పోయినట్లే. చెప్పు దీప అని అడుగుతుంది. మీ మీద నేను ఒట్టు వేయలేను అని దీప అంటే.. చాలు దీప నాకు కావాల్సిన సమాధానం దొరికేసింది. నువ్వు ఈ నిశ్చితార్థం జరగనివ్వవు. నా కూతురును సంతోషంగా ఉండనివ్వవు. నీ మనసులో మలినం ఉంది. మళ్లీ ఏదో ఒకటి చేసి చెడగొట్టాలనే ఆలోచన ఉంది అని సుమిత్ర అంటుంది.

నా మనసులో మీకు మేలు జరగాలనే ఉందని దీప చెప్తుంది. అలా అయితే నువ్వొక పని చేయాలని, ఓ గీత గీసి నిశ్చితార్థం అయిపోయేంత వరకూ నువ్వు ఇది దాటి రావడానికి వీల్లేదు. ఇది గీత కాదు నా మాట అని సుమిత్ర వెళ్లిపోతుంది. అక్కడికి వచ్చిన కార్తీక్.. గీత దాటి రా దీప అని పిలుస్తాడు. ఇది గీత కాదు బావ నా తల్లి ...