భారతదేశం, జనవరి 16 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 16 ఎపిసోడ్ లో దాసును కిడ్నాప్ చేయించిన జ్యోత్స్న మా నాన్నను జాగ్రత్తగా చూసుకోమని రౌడీలకు చెప్తుంది. చావంటే నాకు భయం లేదు జ్యోత్స్న. ఇక మీదట బతకడానికి నువ్వు భయపడతావు. ఎలా తప్పించుకోవాలో తెలియక దొరికిపోతావు. నీ టైమ్ దగ్గర పడింది. నువ్వు జాగ్రత్త జ్యోత్స్న అని దాసు అంటాడు.

ఈ టైమ్ లో నువ్వు వెళ్లేసరికి జ్యోత్స్న అక్కడ ఉండటం ఏంటీ? అని కార్తీక్ ను దీప అడుగుతుంది. ఏదో జరిగింది. దాసు మామయ్య కచ్చితంగా తాత ఇంటికి వెళ్లాలి. కానీ అక్కడ లేడు. నా కోసం ఎదురు చూస్తున్నట్లు జ్యోత్స్న, పారిజాతం ఉన్నారు. జ్యోత్స్ననే ఏదో చేసి ఉండాలి. కానీ పారు కూడా ఉంది. కొడుకుపై ఆమెకు ప్రేమ ఉంది. పారు ఉండగా జ్యో ఏం చేయదు. దాసు మామయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కార్తీక్ చెప్తాడు.

పొద్దున కార్తీక్, దీప కలిసి శివ నారాయణ ఇ...