Hyderabad, జూలై 24 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స వేలికి ఉంగరం తొడగమని గౌతమ్‌కు పంతులు చెబుతాడు. జ్యోత్స్న ఏం చేస్తుందో అని దీప, కార్తీక్ టెన్షన్ పడుతుంది. నేను చెడ్డదాన్ని అయినా పర్వాలేదు. ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంటే చూడలేను. మా అమ్మ గీసిన గీత దాటుతాను అని దీప అంటుంది.

మన దగ్గర ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బీ ఉంటుంది మరదలా అని కార్తీక్ అంటాడు. ఇంతలో శివ నారాయణ వచ్చి ఆపరా అని అరుస్తాడు. దాంతో గౌతమ్ ఆగిపోతాడు. వెళ్లి గౌతమ్‌ను కొడతాడు శివ నారాయణ. నా మనవరాలితోనే ఆడుకోవాలని చూస్తావా అని అలాగే కొడతాడు. ఈ వెధవని షూట్ చేసి పడేయాలి అని దశరథ్‌ను పిలిస్తే.. ఆ వెనుకే దాసు వస్తాడు.

ఈ గౌతమ్ ఎలాంటివాడో మీరే చూడండి అని కాశీ తీసిన వీడియోలను దాసు చూపిస్తాడు. గ్రానీ కొడుకు వచ్చి ఈ వీడియోలు చూపించడం ఏంటీ, కాశీ గాడు ఇచ్చాడా అని జ్...