Hyderabad, అక్టోబర్ 9 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ, పారును కారులో గుడికి తీసుకెళ్తాడు కార్తీక్. ఇంత స్లోగా వెళ్లడమేంట్రా అని పారు అంటే ఫాస్ట్‌గా తీసుకెళ్తాడు కార్తీక్. దాంతో పారు శివనారాయణపై పడుతుంది. శివ నారాయణ తిడతాడు. శ్రీధర్ ఇంట్లో దాసు ఉన్నాడటగా, దారిలోనే ఇల్లు కదా. కారు ఆపురా అని కార్తీక్‌కు మెల్లిగా చెబుతుంది పారు.

మంతనాలు ఏంటీ అని శివ నారాయణ అంటే.. అదే విషయాన్ని బయటకు చెబుతాడు కార్తీక్. కొడుకును చూడాలనుకుంటున్నావ్. అంతేగా. సరే అని శివ నారాయణ అంటాడు. దాంతో పారిజాతం సంతోషిస్తుంది. శ్రీధర్ ఇంటికి వెళ్తుంటే అక్కడ దారిలో దాసుతో జ్యోత్స్న మాట్లాడటం చూసి కార్తీక్ షాక్ అవుతాడు. వాళ్లను శివ నారాయణ, పారుకు చూపిస్తాడు కార్తీక్.

దాసుతో జ్యోత్స్న మాట్లాడటం చూసి శివ నారాయణ, పారిజాతం షాక్ అవుతారు. ఎవరి బతికి ఉన్న లేకు...