Hyderabad, జూలై 26 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో చిన్న సార్‌ను షూట్ చేసింది నా భార్య కాదని నిరూపిస్తాను. ఎలానో తెలియదు. కానీ, నిరూపిస్తాను. అది చేసింది ఎవరైనా సరే మెడపట్టుకుని తీసుకొచ్చి మీ కాళ్ల ముందు మోకరిల్లేలా చేస్తాను. అలా నిలబెట్టకపోతే నేను దీప భర్తనే కాదు అని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. వాడు ఛాలెంజ్ చేశాడంటే కచ్చితంగా చేస్తాడని అర్థం అని దశరథ్ అంటాడు.

మళ్లీ కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని జ్యోత్స్న అనుకుంటుంది. అన్ని సమస్యలు తీరినట్లేగా నేను వెళ్తాను అని దాసు అంటే.. నా మనవరాలి జీవితాన్ని కాపాడిన నిన్ను ఊరికే ఎలా పంపిస్తాను. ఈరోజు దాసు మన ఇంట్లోనే మనతోనే భోజనం చేస్తాడు అని శివ నారాయణ అంటాడు. వద్దుసార్ ప్లేట్‌లో భోజనం పెట్టండి. మూలన తింటాను అని దాసు అంటాడు.

సహాయానికి వెల కట్టలేం. కేవలం కృతజ్ఞత మాత్రమే చూపించగలం. ఈ ...