భారతదేశం, జనవరి 24 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్ కిందకు వచ్చి ల్యాప్‌ట్యాప్ తీసుకుని సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తాడు. కెమెరా 2లో కనిపించదు. కెమెరా 1 చూడాలనుకుంటే అది పనిచేయట్లేదు అని దశరథ్ అంటాడు. నెల నుంచి పని చేయట్లేదు అని దశరథ్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. నెల క్రితం కెమెరాను పాడు చేసింది నేనే. నాన్న రిపేర్ చేయకుండా మంచి పనిచేశాడు. అది తెలియక కంగారు పడ్డాను అని జ్యోత్స్న అనుకుంటుంది.

అలా జ్యో తప్పించుకుంటుంది. సీసీ కెమెరా పని చేస్తే ఒక నిజం తెలిసేది అని పారు అంటే.. అవును అని కార్తీక్ అంటాడు. గ్రానీ పొరపాటు పడిందని జ్యోత్స్న వెళ్లిపోతుంటే వెనకే పారిజాతం వెళ్తుంది. దాసు గురించి అడిగితే నీకు బ్రెయిన్ పనిచేయట్లేదు. కళ్లజోడు మార్చు అని అరిచేసి వెళ్లిపోతుంది జ్యోత్స్న. నిజమేనా అని పారిజాతం అనుకుంటుంది. తర్వాత అంతా విందు భోజనాన...