భారతదేశం, జూలై 31 -- కార్తీక దీపం 2 టుడే జులై 31వ తేదీ ఎపిసోడ్ లో దీప అమ్మానాన్న విషయంలో నోరు జారి, మళ్లీ కాంచన దగ్గర కవర్ చేస్తాడు కార్తీక్. ఏంటి బావ, ఎందుకు అలా మాట్లాడావు? నాన్న మాటలు విన్నాక ఈ ఆబ్దికం చేసి తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుందని దీప అంటే.. నాన్న అని పిలిచావు కదా, కుబేర్ కూడా కన్న కూతురిలా పెంచాడు కదా. ఆయన రుణం తీర్చుకుంటున్నానని అనుకో. నా మేనత్త కూతురును అనాథను చేయకుండా తిరిగి నా చేతికి అందించాడు. కుబేర్ రుణం తీర్చుకోవాలని కార్తీక్ చెప్తాడు.

మరోవైపు శ్రీధర్ హడావుడి చూసి ప్రశ్నిస్తుంది కావేరి. భార్యకు సీక్రెట్లు చెప్పిన భర్త బాగు పడ్డట్లు నాలుగు పెళ్లిలు చేసుకున్న వ్యక్తి చెప్పాడని శ్రీధర్ అంటాడు. పెళ్లి అయిన తర్వాత ఏ భర్తకు దెయ్యాలు కలలోకి రావు. ఎందుకంటే కళ్ల ముందే ఉంటాయి కాబట్టి. మగాడి జీవితం ఆడదాని చేతిలో చింతకాయ పచ్చడి...