భారతదేశం, జనవరి 9 -- కార్తీక దీపం 2 టుడే జనవరి 9 ఎపిసోడ్ లో ఎవరు ఇంటి వారసురాలు? ఎవరు కాపాడుతారు? నేను మీ కూతురు అని నాన్నతో చెప్పగలనా? జ్యోత్స్న ఎవరు అంటే కథ మొదలైన చోటుకు వెళ్లాలి. అప్పుడు ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో. ఇప్పుడు జ్యోత్స్న కన్న కూతురు కాదు. ఈ విషయం వాళ్లంతట వాళ్లు బయటపెట్టరు. కానీ బయటపడక తప్పదని కార్తీక్ తో చెప్తూ దీప బాధపడుతుంది.

మా అమ్మ బతకాలి బావ. దాని కోసం నేను ఏమైనా చేస్తా. కన్న కూతురిని నేనే కాబట్టి ఈ విషయం అందరికీ చెప్పాలని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తకు వ్యాధి ఉన్న విషయమే అత్త తట్టుకోలేదు. అలాంటిది జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని చెప్తానంటేవేంటీ? ముందు అత్తకు వ్యాధి గురించి చెప్పి ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత ఎలాగో తెలియాల్సిందే. తొందరపడితే అత్త ప్రాణాలు దక్కవు. జ్యోత్స్న ఇంట్లో నుంచి పారిపోవాలనుకుందని కార్తీక్ చ...