భారతదేశం, డిసెంబర్ 18 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 18 ఎపిసోడ్ లో శౌర్యకు దీప అన్నం తినిపిస్తుంది. దీప వచ్చినప్పటి నుంచి మాట్లాడటం లేదని అనసూయతో కాంచన అంటుంది. శౌర్య పరుగెత్తితే వెనకాల దీప పరుగులు తీస్తుంది. అప్పుడు కాంచన ఆ ప్లేట్ తీసుకుని, కడుపులో బేబీతో అమ్మ పరుగెత్తితే పడిపోతుంది కదా అని శౌర్యతో అంటుంది.

మా అమ్మ నాకు తినిపించకుండా, నేనే తినేలా? చేస్తుంది నానమ్మ మంచిది కాదు. అందుకే తాతయ్య దగ్గరకు పంపించాలని శౌర్య అంటుంది. ఇదే మాట ఎన్ని సార్లు అంటావే అని దీప చేయి ఎత్తుతుంది. వెంటనే దీప అని ఆపిన కాంచన తాతయ్య దగ్గరకు పంపించాలని ఎవరు చెప్పారే అని శౌర్యను అడుగుతుంది. అందరినీ చూసి నాతో నేనే చెప్పుకొన్నానని అంటుంది శౌర్య.

నేను ముద్దుల తాత ఇంటికి వెళ్లినప్పుడు జోగు రాణి తాతతో ఉంటుంది. సుమిత్ర అమ్మమ్మ తాతతో ఉంటుంది. మరి మనకు తాత ఉన్నాడు కదా....