భారతదేశం, జనవరి 3 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీ నాన్న తప్పు చేశాడని నీకు అనిపిస్తుందా అని స్వప్నను అడుగుతాడు శ్రీధర్. కాశీ తప్పు చేశాడు. అతని బుద్ధి మారిపోయిందని స్వప్న అంటుంది. అయినా శ్రీధర్ బాధపడుతుంటాడు. దాంతో తండ్రి ఒడిలో పడుకుని ఏడుస్తూ శ్రీధర్ బాధ గురించి చెబుతుంది.

మీ రెండో పెళ్లి బయట పడ్డాక నా జీవితం ఏమైపోతుందో అని భయపడ్డారు. ఇప్పుడు నాకోసం అలాగే బాధపడుతున్నారు. మేము అందరి ప్రేమ కోరుకుంటాం. మీ మీద మాకున్న ప్రేమను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తాం. నేను పెట్టిన టెస్టుల్లో నువ్వే గెలిచావ్ నాన్న. కానీ, కాశీ ఓడిపోయాడు అని ఏడుస్తూ చెబుతుంది. ఆ మాటలు విని కావేరి కూడా ఏడుస్తుంది.

నమ్మకాన్ని కాశీ దించేసుకున్నాడు. నువ్వింకా మోస్తూనే ఉన్నావ్ అని స్వప్న ఏడిపిస్తుంది. మరోవైపు హాస్పిటల్ నుంచి కార్తీక్ వాళ్లు వస్తారు. సుమిత్రకు ఏ ...