భారతదేశం, డిసెంబర్ 27 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 27 ఎపిసోడ్ లో కాశీ అకౌంట్లోకి రూ.5 లక్షలు వచ్చిన విషయాన్ని కార్తీక్, దీపకు చెప్తుంది స్వప్న. నాన్న అరెస్టుకు కాశీకి ఏదో సంబంధం ఉంది. ఇది జరగడానికి కారణం ఎవరో కాశీకి తెలుసని నా నమ్మకం. అతనిలోని మార్పునకు, ఈ కేసుకు ఏదో సంబంధం ఉంది అన్నయ్య అని స్వప్న అంటుంది.

ముందు ఇంటికి వెళ్దాం పదా అని స్వప్నను తీసుకుని వెళ్తాడు కార్తీక్. స్వప్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రోజు జ్యోత్స్నను కాశీ కలవడం, ఈ ఉద్యోగం, డబ్బుకు ఏదో లింక్ ఉందని దీప అనుకుంటుంది. స్వప్నను తీసుకుని ఇంటికి వస్తాడు కార్తీక్. అప్పుడే కాశీ వచ్చి ఎక్కడికి వెళ్లావ్ స్వప్న అని అడుగుతుంది. నీ గురించి చెప్పడానికే వచ్చింది. నీకు జాబ్ వచ్చిందంట కదా అని కార్తీక్ అంటాడు.

జాబ్ ఏ కంపెనీలో వచ్చిందో తెలుసుకోవచ్చా అని కార్తీక్ అడిగితే, జాయిన్ అయ...