భారతదేశం, నవంబర్ 12 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 12 ఎపిసోడ్ లో అందరూ ఎదురు చూస్తుండగా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కు కొత్త సీఈఓగా శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. అల్లుడు ఇది నువ్వేనా అని పారు అడుగుతుంది. అవును అత్తయ్య ఇది నేనే అని స్టైల్ గా చెప్తాడు శ్రీధర్.

జ్యోత్స్నను పక్కకు జరిపి ఆ సీట్లో కూర్చుంటాడు శ్రీధర్. కొత్త సీఈఓ ఎవరో చెప్తారా? అని జ్యో అడుగుతుంది. ఎదురుగా మనిషిని పెట్టుకుని ఇంకా అడుగుతావేంటీ? అని శివన్నారాయణ అంటాడు. మరి అర్హతల మాటేమిటీ? అని జ్యో అడుగుతుంది. అన్ని అర్హతలు శ్రీధర్ కు ఉన్నాయని శివన్నారాయణ అంటాడు. థ్యాంక్స్ తాతా సీఈఓ అవ్వాలంటే రెండేసి పెళ్లిళ్లు చేసుకోవాలన్నమాట అని జ్యోత్స్న అనగానే శివన్నారాయణ సీరియస్ అవుతాడు.

ఇదే మాట ఇంకెవరైనా అని ఉంటే నోటితో కాదు చేతితో సమాధానం చెప్పేవాణ్...