భారతదేశం, జనవరి 13 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 13 ఎపిసోడ్ లో నేను నీకు ఒక ద్రోహం చేశానన్నయ్య. జ్యోత్స్న గురించి చెప్పాలనుకుంటున్నానని దాసు అంటాడు. జ్యోత్స్న గురించి చెప్పకుండా కార్తీక్, దశరథ అడ్డుకుంటారు. దాసు తను అనుకున్నది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు పక్కకు తీసుకెళ్లి మాట్లాడతానని దశరథ అంటాడు.

చెప్పాల్సింది చెప్తానని దాసు అంటాడు. కాశీ, జ్యోత్స్న నా.. అని దాసు అంటుండగా కార్తీక్ అడ్డుకుంటాడు. కాశీని విడిపించడానికి జ్యోత్స్న సాయం అడిగానని అంటావ్. ఈ మాత్రం దానికి ఎందుకు మామయ్య ఇబ్బంది పడటం? బెయిల్ ఇప్పించమని డైరెక్ట్ గా అడగొచ్చు కదా అని కార్తీక్ డైవర్ట్ చేస్తాడు. దీని గురించే అడగాలని అనుకున్నానని దాసు అంటాడు.

కాశీ బెయిల్ సంగతి చూస్తానని శివ నారాయణ చెప్తాడు. దాసు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బయట దాసును ఆపి కార్తీక్ మాట్లాడతాడు. ...