భారతదేశం, డిసెంబర్ 13 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో పారిజాతం, జ్యోత్స్న పడుకుంటారు. జ్యోత్స్నను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కలగంటుంది పారిజాతం. వద్దు జ్యోత్స్నను అరెస్ట్ చేయొద్దు అంటూ అరుస్తుంది పారిజాతం. దాంతో జ్యోత్స్న లేపుతుంది. ఆఫీస్‌లో నువ్ చేసిన మోసం బయటపడి పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని భయంగా ఉందే అని పారిజాతం అంటుంది.

నాకు ఊరికే కల కాదు. వచ్చిందంటే దానికి సంబంధించి ఎక్కడో పురుడు పోసుకుంటుంది. నీ గురించి ఎవరో లాగుతున్నారే. పొద్దున వచ్చే కల నిజం అవుతుందంటే అని పారిజాతం అంటుంది. నేను అరెస్ట్ అయితే నిన్ను కూడా తీసుకెళ్తానని షాక్ ఇస్తుంది జ్యోత్స్న. ఇది ఎన్ని ఘోరాలు చేసిందో. దీని తప్పులు శ్రీధర్ కనిపెట్టకుండా చూడాలని పారిజాతం అనుకుంటుంది.

మరోవైపు సుమిత్రను దశరథ్ ఎంత లేపిన లేవదు. ఒళ్లు చల్లగా ఉందేంటీ అని భయపడతాడు. వెళ్లి...